కోలీవుడ్ సినిమాలో హిట్ అయిన పలు హారర్ కామెడీ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ లో దర్శకుడు హీరో సుందర్ సి తెరకెక్కించే కామెడీ హారర్ డ్రామా సిరీస్ “అరణ్మణై” కూడా ఒకటి. మరి వీటిలో వరుసగా మూడు హిట్స్ తర్వాత తాను తెరకెక్కించిన నాల్గవ సినిమానే “అరణ్మణై 4”. తెలుగులో “బాక్” గా రిలీజ్ కి వచ్చిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీస్ తమన్నా, రాశి ఖన్నా లు నటించారు.
అయితే ఈ చిత్రం తమిళ నాట మంచి హిట్ గా నిలవగా ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో ఓటిటి ఎంట్రీకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ డిస్నీ + హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు అయితే హాట్ స్టార్ లో నేటి నుంచి స్ట్రీమ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ దర్శకుడు హిప్ హాప్ తమీజా సంగీతం అందించగా సుందర్ సి, కుష్బూ ప్రొడక్షన్ లో సినిమా తెరకెక్కింది.