ఈ వారం రెండు రిలీజ్ లతో మరో యంగ్ హీరోయిన్.!

మన తెలుగు సినిమా దగ్గర గత కొన్ని వారాలు నుంచి అయితే సరైన సినిమా పడలేదనే చెప్పాలి. చాలా డల్ ఫ్రైడే రిలీజ్ లు కొనసాగుతూ మరో ఫ్రైడే అయితే ఇప్పుడు వచ్చింది. అయితే మరీ అంత నోటెడ్ సినిమాలు లేకపోవడం దానితో పాటుగా తక్కువ బజ్ లో సినిమాలు రావడంతో కొంచెం టాక్ బాగున్నప్పటికీ ఆడియెన్స్ లోకి మరీ అంత ఎక్కువ రీచ్ కాలేకపోయాయి.

అయితే గత వారం సినిమాల్లో యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి నటించిన రెండు సినిమాలు “యెవమ్”, “మ్యూజిక్ షాప్ మూర్తి” చిత్రాలు వచ్చాయి. మరి ఇంట్రెస్టింగ్ గా ఈ వారం కూడా మరో యంగ్ హీరోయిన్ కూడా రెండు సినిమాలతో పలకరించబోతుంది. మరి ఆమెనే హెబా పటేల్.

టాలీవుడ్ లో మంచి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో హీరోయిన్ నుంచి ఈ వారంలో రెండు సినిమాలు వచ్చాయి. ఈ శుక్రవారం యంగ్ హీరో చైతన్యరావు తో చేసిన చిత్రం “హనీ మూన్ ఎక్స్ ప్రెస్” ఒకటి కాగా రేపు శనివారం సుమన్ తేజ్ హీరోగా హెబా హీరోయిన్ గా నటించిన “సందేహం” తో రాబోతుంది. ఇలా రెండు సినిమాలు అయితే ఈ యంగ్ హీరోయిన్ నుంచి ఉన్నాయి. మరి వీటితో ఆమె ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version