స్టార్ హీరోయిన్ పెళ్లితో ఆ రూమర్స్ కి చెక్..

రీసెంట్ గా బాలీవడో స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన ప్రముఖ నటి సోనాక్షి (Sonakshi Sinha) సిన్హా పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి తన పెళ్లి విషయంలో తన కన్నా బయటివారు ఎందుకు అంత ఆసక్తి కనబరుస్తున్నారో అని సోనాక్షి కౌంటర్ లు కూడా వేసింది. అయితే తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) ని ఆమె ఈ జూన్ 23న ముంబై లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతుండగా వీరి వివాహం పట్ల రీసెంట్ గా కొన్ని పుకార్లు వినిపించాయి.

సోనాక్షి ఈ పెళ్లి చేసుకోవడానికి తన తల్లికి ఇంకా సోదరుడికి ఇష్టం లేదని వారిద్దరూ కూడా సోషల్ మీడియాలో ఆమెని అన్ ఫాలో చేశారు అని కొన్ని వార్తలు బాలీవుడ్ వర్గాల్లో వినిపించాయి. అయితే ఇవన్నీ అబద్దం అని సోనాక్షి ప్రూవ్ చేసింది. తన పెళ్ళికి ఇద్దరినీ ఆశీర్వదించడానికి ఇద్దరు కుటుంబాల పెద్దలు కూడా నిన్న గురువారం రాత్రే కలిసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు తేలింది. అలాగే ఇద్దరి ఫ్యామిలీ లు కలిసి హ్యాపీగా గడుపుతున్న కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version