ఓటిటి డేట్ లాక్ చేసుకున్న “భజే వాయు వేగం”?


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అలాగే విలన్ కూడా అయినటువంటి కార్తికేయ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “భజే వాయు వేగం” కోసం తెలిసిందే. మరి మరి డీసెంట్ బజ్ నడుమ వచ్చిన ఈ చిత్రం కొంచెం డల్ గా ఉన్న టాలీవుడ్ లో ఆడియెన్స్ కి మంచి కిక్ ని ఇచ్చింది.

ఇలా థియేటర్స్ లో మంచి ట్రీట్ ని అందించిన ఈ సినిమా ఇపుడు థియేట్రికల్ రన్ ని అయితే ఆల్ మోస్ట్ పూర్తి చేసేసుకుంది. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా ఈ జూన్ 28 నుంచి అలా ఓటిటి లో అందుబాటులో ఉండనుంది అని తెలుస్తుంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఈ నెల లోపు సినిమా రానున్నట్టుగా వినిపిస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాలో రవి శంకర్, హ్యాపీ డేస్ టైసన్, తనికెళ్ళ భరణి తదితరులు నటించగా రధన్, కపిల్ కుమార్ జమ్ముల సంగీతం అందించారు. అలాగే యూవీ కాన్సెప్ట్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు.

Exit mobile version