ప్రియ‌ద‌ర్శి, న‌భా న‌టేష్ ల ‘డార్లింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘డార్లింగ్’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్ట‌ర్స్, ‘ఖ‌ల్లాసే’ సాంగ్ ఆడియెన్స్ ను ఆక‌ట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి మేక‌ర్స్ రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు.

పూర్తి కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రానున్న ‘డార్లింగ్’ చిత్రాన్ని జూలై 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తుండ‌గా, ‘హ‌ను-మాన్’ చిత్ర నిర్మాత నిరంజ‌న్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాలో అందాల భామ న‌భా నటేష్ తో పాటు అన‌న్య నాగ‌ళ్ల‌, మొయిన్, శివారెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version