టాలీవుడ్ నటుడు కార్తికేయ ప్రధాన పాత్రలో నటించిన భజే వాయు వేగం చిత్రం ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
నెట్ ఫ్లిక్స్ లో భజే వాయు వేగం చిత్రం జూన్ 28 వ తేదీ నుండి ప్రసారం కానుంది. భజే వాయు వేగంలో ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవి శంకర్ మరియు శరత్ లోహితస్వ కీలక పాత్రల్లో నటించారు. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించగా, కపిల్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.