“భారతీయుడు 2” ట్రైలర్ పై అందరి దృష్టి..


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సిద్ధార్థ్ లు ముఖ్య పాత్రల్లో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “భారతీయుడు 2” కోసం అందరికీ తెలిసిందే. మరి మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం ఈ మూవీ లవర్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన మ్యూజిక్ ఆల్బమ్ కూడా మంచి హిట్ కాగా ఈ తర్వాత ట్రైలర్ అనౌన్స్మెంట్ కూడ మేకర్స్ ఇచ్చేసారు.

ఇక ఈరోజు ఈ ట్రైలర్ విడుదల కానుండగా అసలు ఈ సారి శంకర్ ఏం ప్లాన్ చేశారు అనేది తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి గా ఈ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. తన మార్క్ గ్రాండియర్, యాక్షన్ ఇవన్నీ ఎలా ఉంటాయా అని అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు రానున్న ఈ అవైటెడ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు అలాగే లైకా ప్రొడక్షన్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version