‘బాహుబలి’ మేకర్స్ “యక్షిణి” లో వేదిక కి స్పెషల్ అప్లాజ్


మన టాలీవుడ్ ప్రైడ్ చిత్రం “బాహుబలి” లాంటి సెన్సేషనల్ చిత్రాన్ని అందించిన నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వారి నుంచి రీసెంట్ గా వచ్చిన ఓ సాలిడ్ సోసియో ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్ నే “యక్షిణి”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ వేదిక ముఖ్య పాత్రలో నటించిన ఈ సిరీస్ రీసెంట్ గానే ప్రముఖ ఓటిటి యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

“జోహార్”, రీసెంట్ హిట్ “కోటబొమ్మాళి పీఎస్” చిత్రాలని తెరకెక్కించిన యువ దర్శకుడు తేజ మార్ని ఈ సిరీస్ ని తెరకెక్కించగా ఈ సిరీస్ చూసిన వారు అందరి నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటుగా మెయిన్ గా నటి వేదిక అమేజింగ్ పెర్ఫామెన్స్ కి అయితే వీక్షకులు ఫిదా అయ్యారని చెప్పాలి.

ఆమె ఈ సిరీస్ లో కనబరిచిన నటన కోసం సోషల్ మీడియాలో కూడా ఆమెని ట్యాగ్ చేసి మరీ ఫాలోవర్స్ మెచ్చుకుంటున్నారు. ఆ రేంజ్ లో ఈ సిరీస్ కి తన “యక్షిణి” పాత్రకి ఆమె ప్రాణం పెట్టింది. ఇక ఈ సిరీస్ లో మంచు లక్ష్మి, అజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా ప్రస్తుతం ఈ సిరీస్ పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

Exit mobile version