మాస్ మహరాజ్ “మిస్టర్ బచ్చన్” రిలీజ్ పై లేటెస్ట్ బజ్


ప్రస్తుతం మన టాలీవుడ్ ఎనర్జిటిక్ సీనియర్ హీరో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మిస్టర్ బచ్చన్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా హిందీ చిత్రం రైడ్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో పూర్తవుతుండగా లేటెస్ట్ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే దానిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. మరి దీని ప్రకారం మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version