106 ఏళ్ల తాత ఫైట్స్ ఎలా? శంకర్ వివరణ వైరల్


ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి బజ్ ఉన్నటువంటి లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు శంకర్ అలాగే యూనివర్సల్ లో హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ చిత్రం “ఇండియన్ 2” కూడా ఒకటి. మరి ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నిన్ననే వచ్చిన ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ ని ఈ సినిమా అందుకుంది.

అయితే ఈ ట్రైలర్ లో సేనాపతిగా కమల్ హాసన్ చేసిన ఫీట్స్ ఓ రేంజ్ లో అందరినీ ఎగ్జైట్ చేసాయి. కానీ ఇదే సమయంలో కొన్ని లాజిక్స్, డౌట్స్ కూడా బయటకి వచ్చాయి. అయితే భారతీయుడుగా కమల్ వయసు సినిమాలో ప్రస్తుతానికి 106 ఏళ్ళు ఉంటుందట. మరి 106 ఏళ్ళు ఉన్న ఒక తాత ఈ రేంజ్ లో ఫైట్ లు, ఎగిరెగిరి కొట్టడాలు ఎలా సాధ్యం అవుతుంది అని శంకర్ పై కమల్ పై కొన్ని కామెంట్స్ వినిపిచసాగాయి.

అయితే వీటికి శంకర్ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. ఈ ప్రశ్న నిన్న ట్రైలర్ లాంచ్ లోనే శంకర్ కి ఎదురవ్వగా శంకర్ సాలిడ్ ఆన్సర్ ఇచ్చారు. అంత వయస్సున్న వ్యక్తి ఇలా ఫైట్స్ చేయడం సాధ్యమే అని తాను చెప్పారు. చైనాలో లూ జియాన్ అనే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ 120 ఏళ్ల వయస్సులో గాల్లో ఎగురుతున్నారు, కిక్స్ ఇస్తున్నారు ఫైట్స్ చేస్తున్నారని తెలిపారు. ఆ ప్రేరణతో సేనాపతి పాత్రని తాను తీర్చిదిద్దినట్టుగా శంకర్ అయితే అందరికీ క్లారిటీ ఇచ్చారు. దీనితో ఆ ట్రోల్స్ పై శంకర్ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది.

Exit mobile version