ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “భజే వాయు వేగం”


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ హిట్ చిత్రం “భజే వాయు వేగం”. మరి డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఈ మధ్య కాలంలో అయితే మన టాలీవుడ్ నుంచి మంచి హిట్ అయ్యింది. ఈ మే 31న రిలీజ్ కి ఈ సినిమా రాగ యాక్షన్ మూవీ లవర్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చి అదరగొట్టింది. ఇక దీని ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఫైనల్ గా ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చేసింది.

ఈ సినిమా హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ చిత్రం నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతానికి ఒక్క తెలుగులో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రానికి రధన్ పాటలు అందించగా కపిల్ కుమార్ బాక్గ్రౌండ్ స్కోర్ ని అందించాడు. అలాగే ఈ సినిమాని యూవీ కాన్సెప్ట్స్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version