‘బుజ్జిగాడు’ లో రజిని ఫ్యాన్ గా.. ఇప్పుడు రజినీనే ప్రభాస్ సినిమాకి ఎలివేషన్


కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవర్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు కోలీవుడ్ లో పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి రజినీకాంత్ కి మన తెలుగు ఆడియెన్స్ లో కూడా ఎప్పుడు నుంచో మంచి ఆదరణ ఉంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాని షేక్ చేస్తున్న భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” (Kalki 2898 AD) కోసం తలైవర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు కేజ్రీగా మారింది.

తాను కల్కి సినిమా సినిమా చూశానని దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ఇండియన్ సినిమాని భిన్నమైన స్థాయిలోకి తీసుకెళ్లాడు. నా డియర్ ఫ్రెండ్ అశ్విని దత్, అమితాబ్, ప్రభాస్, కమల్ హాసన్ ఇంకా దీపికా లకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని లాస్ట్ లో పార్ట్ 2 కోసం చాలా ఎదురు చూస్తున్నాను అంటూ తలైవర్ ఎగ్జైటింగ్ పోస్ట్ పెట్టారు.

దీనితో అభిమానుల్లో ఈ సాలిడ్ పోస్ట్ మరింత ఉత్సాహం తీసుకొచ్చింది. అయితే ప్రభాస్ తన బుజ్జిగాడు సినిమాలో రజిని వీరాభిమానిగా కనిపించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు తన సక్సెస్ జర్నీ ఎంత వరకు వచ్చింది అంటే అదే రజినీ ప్రభాస్ సినిమాకి ఎలివేషన్ ఇచ్చేంత వచ్చింది అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ సక్సెస్ కి ప్రభాస్ అర్హుడని చెప్పి తీరాలి.

Exit mobile version