యూఎస్ లో ఆగని “కల్కి” మ్యానియా.. మరో రికార్డు మార్కు


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో బిగ్ స్క్రీన్స్ ని హిట్ చేసి సాలిడ్ టాక్ ని సంతరించుకుంది.

అయితే ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అదరగొడుతుండగా యూఎస్ మార్కెట్ లో అయితే రికార్డులు తిరగరాస్తుంది. ఇంకా వీకెండ్ పూర్తి కాకుండానే నార్త్ అమెరికాలో 10 మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా కల్కి దూసుకెళ్తుంది. జస్ట్ లేటెస్ట్ గానే ఈ చిత్రం 9 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేయగా నెక్స్ట్ స్టాప్ 10 మిలియన్ మార్క్ అనే చెప్పాలి.

దీనితో యూఎస్ మార్కెట్ లో కల్కి మ్యానియా ఏ స్థాయిలో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి లాంగ్ రన్ లో సినిమా ఎక్కడ ఆగుతుందో అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇక ఈ చిత్రంలో కమల్, అమితాబ్ లాంటి దిగ్గజాలు ముఖ్య పాత్రల్లో నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version