నైజాంలో “కల్కి” మూడో రోజు వసూళ్లు..


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ ముఖ్య పాత్రలో దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మొత్తానికి అయితే సినిమా థియేటర్స్ లో వచ్చి సెన్సేషనల్ నంబర్స్ ని బాక్సాఫీస్ దగ్గర నమోదు చేస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల వసూళ్లు మంచి స్ట్రాంగ్ గానే వస్తుండగా నైజాం లో మొదటి రోజు నుంచి కల్కి మంచి వసూళ్లు రాబడుతుంది. అలా రెండు రోజుల్లో ఈ చిత్రం సుమారు 30 కోట్ల మేర షేర్ ని రాబట్టేయగా ఇప్పుడు మూడో రోజు పి ఆర్ నంబర్స్ ప్రకారం సుమారు 9 కోట్ల మేర షేర్ ని నైజాంలో ఈ చిత్రం అందుకున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ చిత్రం జస్ట్ మూడు రోజుల్లోనే 40 కోట్ల షేర్ దగ్గరకి వచ్చేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ డే 4 ఆదివారం హాలిడే కూడా బాగానే కలిసి రానుంది. మరి టోటల్ వీకెండ్ కి ఈ సినిమాకి ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి.

Exit mobile version