11వ సినిమాగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్న బెల్లంకొండ శ్రీను


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్రతో “టైసన్ నాయుడు” సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత తన కెరీర్ 11వ సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది. దర్శకుడు కౌశిక్ పెగాళ్ళపాటి తెరకెక్కించనున్న ఈ చిత్రం రేపు జూన్ 1న ఉదయం పదిన్నరకు ముహూర్త కార్యక్రమాలతో మొదలు కానున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు.

అయితే ఈ అనౌన్సమెంట్ పోస్టర్ చూస్తే మంచి ఆసక్తిగా ఉందని చెప్పాలి. ఒక కామిక్ టైప్ పోస్టర్ లా మధ్యలో సెల్ టవర్, పై నుంచి ఒక సైతాను ఉన్నట్టుగా, ఆ టవర్ దిశగా ఓ ఈగ వెళ్తున్నట్టుగా డిజైన్ చేశారు. మరి ఇవన్నీ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తోనే తాను రాబోతున్నాడు అనిపిస్తుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version