మళ్ళీ ఓంరౌత్ మీదే పడ్డ రెబల్స్..


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ వసూళ్లతో అదరగొడుతున్న మరో టాలీవుడ్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి సై ఫై అండ్ మైథలాజి డ్రామాగా వచ్చింది. ఇక అంచనాలు అందుకున్న ఈ చిత్రం ఈ వారాంతంలో అయితే క్రేజీ వసూళ్లు రాబడుతూ అదరగొడుతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ప్రభాస్ తో మైథలాజి చిత్రం చేసిన “ఆదిపురుష్” అభిమానులని ఆడియెన్స్ ని ఎంతలా డిజప్పాయింట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత నుంచి ఏ ఇతర భారీ సినిమా కొంచెం బాగున్నా నెటిజన్స్ ఓం రౌత్ నే ట్రోల్ చేస్తున్నారు.

మొన్న “హను మాన్” వచ్చాక కానీ ఇప్పుడు “కల్కి” వచ్చిన తర్వాత కూడా ఇలా సినిమాలు చేయాలి అంటూ సోషల్ మీడియాలో రెబల్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ట్రోల్ చేస్తున్నారు. ఇంకా ఫన్నీగా కల్కి సినిమాలో కనిపించే తరహాలో ఓం రౌత్ పై బౌంటీ అలర్ట్ అంటూ కూడా పోస్ట్ లు చేస్తున్నారు. ఇలా ఏ భారీ సినిమా వచ్చినా కూడా ఓంరౌత్ నే ఎందుకో హైలైట్ అవుతున్నాడు.

Exit mobile version