3 రోజుల్లో వరల్డ్ వైడ్ “కల్కి” భారీ వసూళ్లు.!


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కి హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” మేనియా ఇప్పుడు ఏ రేంజ్ లో నడుస్తుందో చూస్తూనే ఉన్నాము. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలు అందుకొని సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది. అలా కేవలం రెండు రోజుల్లోనే సుమారు 300 కోట్ల మేర వసూళ్లు కొల్లగొట్టేసిన ఈ చిత్రం ఇపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది.

ఇక ఈ మూడు రోజుల్లోనే ఈ చిత్రం మరింత స్థాయిలో వసూళ్లు అందుకుని అదరగొడుతుంది. ఈ మూడో రోజు కూడా 100 కోట్లకి పైగా గ్రాస్ ని కల్కి రాబట్టి ఏకంగా 415 కోట్ల గ్రాస్ మార్క్ ని కొట్టేసింది. దీనితో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఒక ఊహించని రన్ ని అయితే కొనసాగిస్తుంది అని చెప్పాలి. మరి ఈ ఆదివారం కూడా 100 కోట్ల మార్క్ క్రాస్ అయితే కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రం 500 కోట్ల మార్క్ ని దాటేస్తుంది అని చెప్పాలి.

Exit mobile version