కర్ణుడైనా, రాముడైనా, బాహుబలిగా అయినా ఒకే ఒక్కడిగా ప్రభాస్..


భవిష్యత్ తారలలో భారతీయ సినిమా కోసం కానీ తెలుగు సినిమా ప్రస్తావన వచ్చినా కానీ ఖచ్చితంగా కేవలం కొంతమంది హీరోల మాట వస్తే అందులో తప్పకుండా తెలుగు సినిమా రూపు రేఖలు మార్చిన హీరోగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ పేరు నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక హీరో ఒక్క జానర్ అని కాకుండా అన్ని జానర్ లలో కూడా సెట్ అవ్వగలిగే హీరోలు చాలా చాలా తక్కువ మందే ఉంటారు.

ఒక పాత్ర అంటే అందుకు తగ్గ ఠీవి, రాజసం అన్నీ కలగలిపి ఉండాలి మరి ఇలాంటి లక్షణాలు అన్నీ ప్రభాస్ లో పుష్కలంగా ఉన్నాయి అందుకే తనకి వెతుక్కుంటూ ఎన్నో అద్భుతమైన పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి, వస్తున్నాయి. అలా ఇండియన్ సినిమా దగ్గర కొన్ని చారిత్రాత్మిక పాత్రలు ప్రభాస్ చేసి వాటికి సరైన పాత్రదారుడిగా ప్రభాస్ వాటిని రక్తి కట్టించాడు.

రాజమౌళితో బాహుబలి గా కనిపించినా ఓం రౌత్ తో ఆదిపురుష్ లో రాముడిగా కనిపించినా ఇప్పుడు నాగ్ అశ్విన్ తో కర్ణుడిగా ఆ పాత్రకి ప్రాణం పోసినా అది ప్రభాసుడికి ఒక్కడికే నేటి తరంలో చెల్లింది అని చెప్పవచ్చు. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ నే ఎందుకు ఇలాంటి పాత్రలకి ఓకే చేస్తారు అనేది కూడా చాలా మందిలో మెదిలి ఉంటుంది. ఒక పక్క తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించడంతో పాటుగా కొన్ని గుర్తుండిపోయే పాత్రలకి కూడా కేరాఫ్ గా ప్రభాస్ నిలిచి చరిత్రలో తనకు ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.

Exit mobile version