ఆ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేరుగా ఓటీటీలోకి


ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి దర్శకత్వంలో సుమంత్‌ హీరోగా రూపొందించిన చిత్రం ‘అహం రీబూట్‌’. ఈ సినిమా ఎప్పుడో చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఐతే, ఈ మూవీని థియేటర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో జూన్‌ 30వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతుంది.

అసలు ఈ సినిమా మెయిన్ పాయింట్ ఏమిటంటే.. ‘స్టూడియోలో ఉన్న ఆర్జే నిలయ్‌(సుమంత్‌)కు ఓ అమ్మాయి నుంచి సాయం కావాలంటూ ఫోన్‌ వస్తుంది. తాను కిడ్నాప్‌ అయ్యానని చెబుతుంది. మరి ఆ యువతిని ఎవరు కిడ్నాప్‌ చేశారు? ఎందుకు చేశారు? ఎలా బయటపడింది? అందుకు ఆర్జే నిలయ్‌ ఏం చేశాడు? అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version