కెన‌డాలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన ‘క‌ల్కి’


ప్ర‌స్తుతం ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతున్న ‘క‌ల్కి 2898 AD’ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సై ఫై ఎపిక్ మూవీలో ప్ర‌భాస్ హీరోగా న‌టించారు. ఇక ఈ సినిమాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగానూ ట్రెమెండ‌స్ రెస్పాన్స్ ల‌భిస్తోంది. ఓవ‌ర్సీస్ లో ‘క‌ల్కి’ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది.

పాత రికార్డుల‌ను చెరిపేసి స‌రికొత్త రికార్డుల‌తో క‌ల్కి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. తాజాగా కెన‌డాలో క‌ల్కి మూవీ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. కెన‌డా దేశంలో ‘క‌ల్కి’ మూవీ ఆల్ టైమ్ హ‌య్యెస్ట్ గ్రాస్ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మేర‌కు చిత్ర యూనిట్ అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ చేసింది.

అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా పటాని త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందించారు. ఈ సినిమాను వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై సి.అశ్వినీద‌త్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు. రాబోయే రోజుల్లో క‌ల్కి ఇంకా ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version