సుప్రీం యాస్కిన్ పై ప్రత్యేక సినిమా


ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొత్తానికి ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో ఇప్పుడు రెండో పార్ట్ పై ఆసక్తి పెరిగింది. కాగా కల్కి సెకండ్ పార్ట్‌ లో ప్రభాస్, కమల్‌ ల మధ్య భారీ పోరాటాలు ఉంటాయని.. ముఖ్యంగా సుప్రీం యాస్కిన్, అతడి కాంప్లెక్స్ కథ చాలా స్పెషల్‌గా ఉంటుందని కల్కి నిర్మాత అశ్వనీదత్ ఇప్పటికే చెప్పారు. అయితే, సుప్రీం యాస్కిన్ పాత్ర, అతడి కాంప్లెక్స్ వరల్డ్ స్పాన్ చాలా పెద్దది అట.

అందుకే, సుప్రీం యాస్కిన్ పాత్ర పైనే ప్రత్యేకంగా ఓ సినిమా చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. కల్కి పార్ట్ 2 అవ్వగానే.. కమల్ మెయిన్ లీడ్ లో సుప్రీం యాస్కిన్ పై సినిమా ఉంటుందట. అన్నట్టు కల్కి సెకండ్ పార్ట్‌కు సంబంధించి 60 శాతం చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. 2026లో ‘కల్కి-2’ రిలీజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమలోనే భారీ సినిమాగా ఈ చిత్రం నిలిచింది.

Exit mobile version