“మహారాజ” ఓటిటి డేట్ ఫిక్స్?


కోలీవుడ్ వెర్సటైల్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా యువ దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మహారాజ”. మరి ఇంటెన్స్ ఎమోషన్స్ మరియు సాలిడ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యింది.

తమిళ్ సహా తెలుగులో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు అందుకొని లాభాలు అందించగా తాజాగా ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో కూడా చేరి విజయ్ సేతుపతి కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 50వ గా వచ్చి ఒక గుర్తుండిపోయే హిట్ లా నిలిచింది. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ సంబంధించి లేటెస్ట్ బజ్ అయితే వినిపిస్తుంది.

కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం అయితే ఈ జూలై 19 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఓటిటి హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి అందులో ఈ సినిమా జూలై 19 నుంచి రానున్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version