రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD. ఈ చిత్రం ధియేటర్లలో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాక ప్రభాస్ పై కూడా పలు వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ లాంటి స్టార్ ఉంటే, తనతో ఎలాంటి ఎక్స్పెర్మెంట్ అయినా చేయొచ్చు. ఎంత బడ్జెట్ అయినా పెట్టొచ్చు. ఎలాంటి మూవీ అయినా తీయొచ్చు. ఎలాంటి లార్జర్ దేన్ లైఫ్ రోల్ అయినా ప్రభాస్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే కల్కి2 గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. కల్కి 2 చిత్రాన్ని దాదాపు 25 నుండి 30 రోజులు షూట్ చేశాం అని అన్నారు. కాకపోతే చాలా యాక్షన్ పార్ట్ మిగిలి ఉంది అని అన్నారు. అంతేకాక పార్ట్ 2 లో నాల్గవ ప్రపంచం ను పరిచయం చేస్తాం అని, ఇంకా కొత్త పాత్రలు చాలా వస్తాయి అని అన్నారు. పార్ట్ వన్ లో చూపించిన విధంగానే శ్రీ కృష్ణుడు పాత్రను డార్క్ షాడో లో చూపిస్తా అని అన్నారు. అంతేకాక ఈ పాత్రలో వేరే ఎవరు నటించడం లేదు అని స్పష్టం చేశారు. ఇంకా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు నాగ్ అశ్విన్.