హాలీవుడ్ లో తెరకెక్కిన ”డెడ్ పూల్ & వుల్వరైన్” సూపర్ హీరో మూవీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. తెరపై యాక్షన్ కు కొదవ లేకుండా ఉండే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూలై 26న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా వుల్వరైన్ పాత్రలో నటిస్తున్న హ్యూ జాక్మన్ ఓ ఇంటర్వూలో ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించడం విశేషంగా మారింది. మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా.. మీకు ప్రస్తుతం ఉన్న ప్లేయర్లలో ఎవరంటే బాగా ఇష్టం? అని ఓ ఇంటర్వ్యూలో ఆయన్ను అడిగారు. దీనికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘రోహిత్’ అని సమాధానం చెప్పారు. రోహిత్ ఒక బీస్ట్ లాగా ఆడతాడు. నాకు అతని ఆట చూడడం చాలా ఇష్టమని తన అభిమానాన్ని ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్ హ్యూ జాక్మన్ చాటుకున్నారు.
ఇలా హాలీవుడ్ నటుడు హ్యూ జాక్మన్ రోహిత్ పై తన అభిప్రాయాన్ని చెప్పడంతో ఇండియాలోని కోట్లాది మంది గుండెల్లో ఆనందం నింపేలా చేశాడు. ఇక మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న ”డెడ్‌పూల్ & వుల్వరైన్” మూవీ ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది.