మరో ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసిన మైండ్ బెండింగ్ థ్రిల్లర్ “ఆరంభం”

టాలీవుడ్ ఎమోషనల్ క్లాసిక్ చిత్రం ‘C/o కంచరపాలెం’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ భగత్ లీడ్ రోల్ లో నటించిన రీసెంట్ మైండ్ బెండింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ “ఆరంభం”. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోగా నెక్స్ట్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరో స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

టైమ్ ట్రావెల్, డెజా వూ అంశాలను అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది, భవానీ మీడియా ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ యూనిక్ ఎంటర్‌టైనర్ విడుదలైయింది. టైమ్ ట్రావెల్, డెజావు కాన్సెప్ట్ బ్లెండ్ చేసి మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ చేసే ఈ సినిమా ఆడియన్స్ కి మునుపెన్నడూ లేని అనుభూతిని ఇస్తోంది. మరి మన తెలుగు నుంచి ఈ తరహా ప్రయోగాత్మక చిత్రాలు రావడం అరుదు అది కూడా మంచి కంటెంట్ ఉన్నది కాబట్టి ప్రైమ్ వీడియో ఉన్న వారు ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు.

Exit mobile version