కిరణ్ అబ్బవరం నెక్స్ట్ పై లేటెస్ట్ అప్డేట్


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకడైన కిరణ్ అబ్బవరం ఇటీవల సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ గ్యాప్ లోనే తాను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే మళ్ళీ ఫైనల్ గా కొత్త సినిమాతో అయితే రాబోతున్నాడు. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కార్డు అనౌన్సమెంట్ తో ఈ జూలై 9న టైటిల్ ని రివీల్ చేయబోతున్నట్టుగా దీనితో క్లారిటీ ఇచ్చాడు.

అలాగే ఈ పోస్టర్ లో చూసినట్టు అయితే అభినయ వాసు దేవ్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ దీపాల పద్మనాభంకి పంపించిన ఉత్తరంలా ఇది కనిపిస్తుండగా దీనితో ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో తాను హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా మారి మరో కొత్త భాద్యతని ని తీసుకున్నాడని చెప్పాలి. మరి ఈ జూలై 9న ఏ టైటిల్ తో ఈ సినిమా రానుందో వేచి చూడాలి.

Exit mobile version