బాలయ్య పై స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ ను శరవేగంగా షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య వెరీ పవర్ ఫుల్ లుక్ లో కనిపించబోతున్నాడట. పైగా బాలయ్య పై వచ్చే ఫైట్స్ అన్ని చాలా స్టైలిష్ గా ఉంటాయని.. సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్స్ లో ఈ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్సే హైలైట్ గా ఉంటుందని టాక్ నడుస్తోంది.

ఏది ఏమైనా ఈ కోసం బాలయ్య ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.

Exit mobile version