సితార్ సాంగ్ ప్రోమో.. అదిరిపోయింది!

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై అంచ‌నాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి సితార్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌డంతో ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

తొలుత ఈ సాంగ్ ను జూలై 8న రిలీజ్ చేస్తామ‌ని చెప్పిన మేక‌ర్స్ కొన్ని కార‌ణాల వ‌ల్ల రిలీజ్ డేట్ ను జూలై 10కి మార్చారు. అయితే, ఈ సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. చ‌క్క‌టి మెలోడి మ్యూజిక్ తో ఉన్న ఈ ప్రోమో అభిమానుల‌తో డ్యాన్స్ వేయించేలా ఉంది. ఈ పాట‌లో ర‌వితేజ వింటేజ్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. ఇక ఆయ‌న వేసిన స్టెప్పు ఫ్యాన్స్ కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేస్తుంది.

ఈ సినిమాలో అందాల భామ భాగ్య‌శ్రీ బొర్సె హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, జ‌గ‌ప‌తి బాబు విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. జూలై 10న రిలీజ్ అయ్యే సితార్ సాంగ్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Exit mobile version