కల్కి: బీటీఎస్ స్టిల్స్ రిలీజ్ చేసిన దిశా పటాని!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి2898ఎడి. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రంలో దీపికా పదుకునే, దిశా పటాని లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించడం జరిగింది. అయితే దిశా పటాని సోషల్ మీడియాలో కల్కి చిత్రం కి సంబందించిన బీటీఎస్ స్టిల్స్ ను రిలీజ్ చేయడం జరిగింది.

ఈ స్టిల్స్ ప్రేక్షకులని, అభిమానులని అలరిస్తున్నాయి. నాగ్ అశ్విన్, ప్రభాస్ లతో ఉన్న ఫోటో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలు కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Exit mobile version