విక్రమ్ “తంగలాన్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తంగలాన్. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం, కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే ట్రైలర్ రిలీజ్ పై మేకర్స్ సరికొత్త ప్రకటన చేయడం జరిగింది.

తంగలాన్ చిత్రం ట్రైలర్ ను జూలై 10, 2024 న రిలీజ్ చేయనున్నారు మేకర్స్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో విక్రమ్ లుక్ అభిమానులను అలరిస్తుంది. అయితే ఈ ట్రైలర్ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 2 నిమిషాల 12 సెకన్ల నిడివితో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఆడియెన్స్ ను అలరించనుంది. ట్రైలర్‌లో రిలీజ్ డేట్ కూడా ఉంటుందని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

పవర్ ఫుల్ మూమెంట్స్‌తో ట్రైలర్‌ను మేకర్స్ ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్ రిలీజ్ సినిమా పై బజ్ పెరుగుతుందని అంతా భావిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుంది. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version