బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీనింగ్ లో “కల్కి” చిత్రాన్ని చూడనున్న నాగ్ అశ్విన్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి. ఈ చిత్రం ధియేటర్లలో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం ఈ వారాంతంకి వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ యూఎస్ఏ ప్రాంతంలోని బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీనింగ్ లో కల్కి చిత్రాన్ని చూడనున్నారు.

ఈ శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు TCL చైనీస్ ధియేటర్స్ లో సినిమా చూడనున్నారు నాగ్ అశ్విన్. ఈ భారీ బడ్జెట్ మూవీలో దీపికా పదుకునే, దిశా పటాని లు హీరోయిన్స్ గా నటించగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version