ప్రభాస్ “కల్కి” ఓఎస్టీ రిలీజ్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఎడి చిత్రం ధియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం కి సంబందించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను మేకర్స్ నేడు యూ ట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పాలి.

ఈ చిత్రంకు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అధ్బుతమైన సంగీతం అందించారు. సినిమాలోని చాలా కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకునే, దిశా పటాని లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version