ఫైనల్ గా ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న పృథ్వీ రాజ్ “ది గోట్ లైఫ్”


మళయాళ సినిమా టాలెంటెడ్ నటుల్లో ప్రముఖ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఒకరు. మరి మన టాలీవుడ్ లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” తో టాలీవుడ్ ఎంట్రీ తాను ఇవ్వగా అక్కడ నుంచి మన తెలుగు ఆడియెన్స్ కి పృథ్వీ మరింత దగ్గరయ్యాడు.

అయితే ఈ సినిమా తర్వాత తన నుంచి వచ్చిన అవైటెడ్ పాన్ ఇండియా సినిమానే “ది గోట్ లైఫ్ ఆడు జీవితం”. ఈ చిత్రాన్ని దర్శకుడు బ్లేస్సి తెరకెక్కించగా ఈ ఏడాది మార్చ్ లో రిలీజ్ కి వచ్చింది. అయితే ఒక సర్వైవల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం మళయాళంలో భారీ వసూళ్లు అందుకొని అదరగొట్టింది.

కానీ అప్పుడు నుంచి ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడు ఏంటి అనేది క్లారిటీ రాలేదు. కానీ ఫైనల్ గా ఇప్పుడు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు డేట్ ని అనౌన్స్ చేసేసారు. ఈ అవైటెడ్ సినిమా ఈ జూలై 19న పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి రానున్నట్టుగా తెలియజేసారు. మరి అప్పుడు నుంచి ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఆల్టా గ్లోబల్ మీడియా, విజువల్ రొమాన్స్ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version