“దేవర” లీక్స్ తో జాగ్రత్తలు.!?


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “దేవర”. మరి దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై గట్టి అంచనాలు నెలకొనగా ఇప్పుడుకే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విషయంలో ఇటీవల కొన్ని లీకులు బయటికి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఆన్ లోకేషన్ నుంచే పలు వీడియోలు బయటకి వచ్చేసాయి. అలాగే రీసెంట్ గా ఓ డైలాగ్ కూడా దేవర సినిమా లోనిదే అంటూ ఓ లైన్ కూడా వైరల్ అయ్యింది. దీనితో ఈ లీక్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక నుంచి డైలాగ్స్ కానీ ఎలాంటి విజువల్స్ కూడా బయటకి రాకుండా పటిష్టమైన సూచనలు కొరటాల అందిస్తున్నాడట. మరి ఇప్పుడు ఉన్న సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ ఏదొకలా లీక్స్ బయటకి వచ్చేస్తున్నాయి. మరి ముందు రోజుల్లో అయినా దేవర నుంచి ఆగుతాయో లేదో చూడాలి.

Exit mobile version