‘దేవర’లో జాన్వీ పాత్ర పై క్రేజీ న్యూస్

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, జాన్వీ కపూర్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటించబోతుందని.. సినిమాలో ఆమె పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని టాక్. మరి ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఏ స్థాయిలో తన విలనిజాన్ని చూపిస్తోందో చూడాలి.

కాగా ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుందని.. అలాగే ఆడియో రైట్స్ ని టి-సిరీస్, శాటిలైట్ రైట్స్ ను ‘స్టార్ మా’ సొంతం చేసుకుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version