యంగ్ హీరోతో రొమాన్స్ కు న‌య‌న‌తార గ్రీన్ సిగ్న‌ల్..?


స్టార్ బ్యూటీ న‌య‌న‌తార ప్ర‌స్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఆమె న‌టించే సినిమాల కోసం మూవీ ల‌వ‌ర్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్ప‌టికే బిగ్ బాస్ ఫేం కెవిన్ హీరోగా నటించ‌బోతున్న ఓ సినిమాలో న‌య‌నతార న‌టించ‌బోతున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను డెబ్యూటంట్ విష్ణు ఇడ‌వ‌న్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఇక ఈ సినిమాలో న‌య‌న‌తార పాత్ర‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బ‌జ్ వినిపిస్తోంది. ఈ సినిమాలో న‌య‌న్ కెవిన్ కంటే వ‌య‌సులో పెద్ద‌దిగా ఉంటుంద‌ట‌. అయినా కూడా కెవిన్ ను ప్రేమించే పాత్ర‌లో న‌య‌న్ రెచ్చిపోయి న‌టించ‌బోతున్న‌ట్లుగా చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి.

లోకేశ్ క‌న‌గ‌రాజ్ శిష్యుడైన విష్ణు ఇడ‌వ‌న్ ఈ సినిమాను రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా న‌య‌న్ భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయ‌నున్నాడు. దీంతో న‌య‌న్ అభిమానులు ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version