మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా ”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులను తెరకెక్కిస్తూ బిజీగా మారాడు ఈ హీరో.
మెకానిక్, లైలా అనే రెండు సినిమాలను లైన్ లో పెట్టిన విశ్వక్, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టును ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు కృష్ణ చైతన్య ”పవర్ పేట” అనే పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని నితిన్ తో చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే, ఈ సినిమా నుండి నితిన్ తప్పుకున్నాడు.
ఇక వెంటనే మరో యంగ్ హీరో శర్వానంద్ తో ఈ సినిమాను చేసేందుకు కృష్ణ చైతన్య ప్రయత్నించాడు. కానీ, ఎందుకో శర్వా కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను విశ్వక్ సేన్ తో తెరకెక్కించేందుకు కృష్ణ చైతన్య రెడీ అయ్యాడు. దీనికి విశ్వక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానున్నట్లుగా తెలుస్తోంది.