“డార్లింగ్” బ్లాక్ బస్టర్ అవ్వాలి – హీరో నాని

టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ అశ్విన్ రామ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ డార్లింగ్. ఈ చిత్రం జూలై 19, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ హీరో, నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ వేడుకలో హీరో నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చూసిన ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంది. యాక్షన్ చిత్రాలు ఎక్కువైపోయి, కామెడీ, లవ్ స్టోరీలు బాగా మిస్ అవుతున్నాం. లాస్ట్ ఇయర్ లవ్ స్టోరీ ఎమోషన్ తో కలిపి హాయ్ నాన్న వచ్చాను. ప్రియదర్శి లవ్ స్టొరీ మరియు కామెడీ తో కలిపి వస్తున్నాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. చాలా మంది అన్ని జోనర్స్ ను టచ్ చేయాలి. కొన్నేళ్ళ నుండి మనకి తెలియకుండా ఆడియెన్స్ ను ఒక జోనర్ కే పరిమితం చేశాం. చిన్నప్పుడు సినిమాలంటే అన్ని రకాల జోనర్స్ వచ్చాయి. అన్ని ఎంజాయ్ చేసే వాళ్ళం. ధియేటర్ కి వెళ్ళడానికి ఎక్కువ రీజన్స్ ఉండేవి. ఇప్పుడు తెలియకుండానే ఒక్క జోనర్ మీద ఫోకస్ చేస్తున్నాం. అందరం కామెడీ, ఎమోషన్, యాక్షన్, లవ్ టచ్ చేయాలి. దర్శి లాంటి యాక్టర్ ఇలా అన్ని చేయడం చాలా గర్వం గా ఉంది అని అన్నారు.

కాన్సెప్ట్ అదిరిపోయింది. స్పిట్ పర్సనాలిటీ అంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లేడీ అపరిచితుడు. అలాంటి కాన్సెప్ట్ తో ఎంత ఫన్ జనరేట్ చేయొచ్చు అనేది నేను ఊహించగలను. హనుమాన్ సినిమాకి మిస్ అయ్యాను. ఈ సినిమాకి రావడం కుదిరింది. ఐయామ్ హ్యాపీ. డార్లింగ్ హనుమాన్ అంత సక్సెస్ అవ్వాలి.

అయితే మరొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని హీరో నాని వెల్లడించారు. తన ప్రొడక్షన్ లో ప్రియదర్శి హీరోగా చేయనున్నట్లు తెలిపారు. దర్శకుడు జగదీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయం అందరిలో ఆసక్తిను రేకెత్తించింది. అయితే ప్రియదర్శి నటించిన బలగం ఈ డికేడ్ లోనే తన ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక హాయ్ నాన్న టైమ్ లో ప్రియదర్శి తో గడిపిన ఫన్ టైమ్ గురించి మాట్లాడటం జరిగింది. ఈ డార్లింగ్ చిత్రం సక్సెస్ సాధించాలి అని, చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు నాని.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version