“బాలయ్య 109” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్స్ ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) అలాగే బాబీ డియోల్ (Bobby Deol) లాంటి నటుల కలయికలో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా చేస్తుండగా దీనిపై సాలిడ్ హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గా కొంచెం గ్యాప్ తర్వాత రీస్టార్ట్ చేసి పూర్తి చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం షూటింగ్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ జూలై 21 నుంచి మొదలు కానుంది అని తెలుస్తుంది. అలాగే షెడ్యూల్ లో మేజర్ పార్ట్ అంతా రాజస్థాన్ లో చేస్తారట. ఇలా మొత్తానికి అయితే బాబీ బాలయ్యతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version