నేను ఆరోగ్యంగానే ఉన్నా – ఆర్ నారాయణ మూర్తి!

ఆర్. నారాయణ మూర్తి గారికి అస్వస్థత కారణం గా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆర్. నారాయణ మూర్తి స్పందించారు. తాను ఆరోగ్యం గానే ఉన్నట్లు పేర్కొన్నారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

తాను కోల్కున్నాక తన ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతాను అని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్. నారాయణ మూర్తి సందేశాత్మక చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

Exit mobile version