ఆసుపత్రిలో చేరిన జాన్వీ క‌పూర్.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం నార్త్, సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. త‌న అందంతో పాటు అభిన‌యంతోనూ జాన్వీ అభిమానుల‌ను అలరిస్తోంది. ఇక ఈ బ్యూటీ ప్ర‌స్తుతం తెలుగులోనూ సాలిడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. జూ.ఎన్టీఆర్ స‌ర‌స‌న ‘దేవ‌ర’ చిత్రంలో న‌టిస్తూనే, రామ్ చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీని కూడా ప్రారంభించింది.

ఇలా వ‌రుస‌గా క్రేజీ చిత్రాల‌తో రానున్న జాన్వీ, అక‌స్మాత్తుగా ఆసుప‌త్రిలో చేరిన‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ల వివాహ వేడుక‌లో సంద‌డి చేసిన జాన్వీ కపూర్ అనారోగ్యానికి గురైన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమెను ముంబైలోని ఓ ఆసుపత్రిలో జాయిన్ చేశార‌ట‌. అయితే, ఆమె అనారోగ్యానికి ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు తెలిపారట. దీంతో ఆమెను డిశ్చార్జ్ చేయ‌నున్నారు.

ఇక జాన్వీ క‌పూర్ ఆసుప‌త్రిలో చేరింద‌నే వార్త తెలుసుకుని అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అయితే, ఆమె ప్ర‌స్తుతం క్షేమంగానే ఉంద‌ని తెలియ‌డంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

Exit mobile version