బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ది మోస్ట్ వయొలెంట్ మూవీగా ఇది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాతో సృష్టించిన విధ్వంసం అందరికీ తెలిసిందే. కల్ట్ క్లాసిక్ మూవీగా బాలీవుడ్ జనాలను ఈ మూవీ ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కృషన్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
టీ-సిరీస్ చైర్ పర్సన్ కృషన్ కుమార్ కూతురు తిషా కుమార్ 20 ఏళ్ల వయసులోనే మృతిచెందింది. క్యాన్సిర్ బారిన పడిన తిషా కుమార్ కు జర్మనీలో అత్యాధునిక వైద్యం కూడా అందించారు. కానీ, పరిస్థితి చేదాటిపోవడంతో తిషా చికిత్స పొందుతూ జూలై 18న మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు.
ఇక టీ-సిరీస్ యాజమాన్యం కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో నిర్మాత ఇంట విషాదం అలుముకుంది. బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు వారికి తమ సంతాపం తెలుపుతున్నారు.