ఉపాసనకు చరణ్ స్పెషల్ బర్త్‌డే విష్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనకు ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తాడో మనం చూస్తూ వస్తున్నాం. ఆమెకు తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లో చాలా మంచి ప్లేస్ ఇస్తూ, తన భార్యకు మర్యాదతో పాటు ప్రేమను పంచుతూ ఉంటాడు ఈ స్టార్ హీరో. ఇక తాజాగా మరోసారి తన భార్య పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు ఈ స్టార్ హీరో.

ఉపాసన బర్త్ డేను పురస్కరించుకుని, చరణ్ ఆమెకు స్పెషల్‌గా విష్ చేశాడు. ‘‘కారా మమ్మీకి బర్త్ డే శుభాకాంక్షలు’’ అంటూ తనదైన శైలిలో పుట్టినరోజు గ్రీటింగ్స్ చెప్పుకొచ్చాడు చరణ్. తమ కూతురు క్లిన్ కారా కి తల్లి అయిన ఉపాసన బర్త్ డే రోజున కూడా తన కూతురి పేరుతోనే భార్యకు విషెస్ చెప్పడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version