ఉత్సాహాల మధ్య యాంకర్ సుమ సందడి, ఆకర్షించిన భరణి , ఆకట్టుకున్న పురాణపండ

suma and puranapanda srinivas

హైదరాబాద్ : జూలై : 22

మానసిక వొత్తిళ్లు ఎక్కువై ఆనందాలు ఆవిరై జీవితాలెన్నో బలహీన పడుతున్న అరవై శాతం పై చిలుకు ఈ కాలంలో హైదరాబాద్ లో ఒక ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ యాంకర్ సుమ చిరు నవ్వులతో చేసిన సందడికి అక్కడ వందలాది మహిళలు, యువకుల సంతోషానికి రెక్కలొచ్చి ఎక్కడికో మరో ఆనందలోకానికి ఎగిరాయనే చెప్పాలి. సినిమా ఈవెంట్స్ లో తప్ప ప్రైవేట్ కార్యక్రమాల్లో ఎక్కువసేపు గడపని సుమ కనకాల చాలా సేపు కుటుంబ వాతావరణాన్నితలపింప చేసి ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకలా సాక్షాత్కరింప చేయడం గమనార్హం.

మరొక ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీ నటులు తనికెళ్ళ భరణి, ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఉత్తేజ పరచడం మరొక ప్రత్యేకతగానే చెప్పాలి. చంద్రశేఖర్ రెడ్డి , రామకృష్ణారెడ్డి అనే యిద్దరు భాగస్వాములు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ను ఆదివారం గురుపూర్ణిమ సుముహూర్తంలో సుమ కనకాల జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం సుమ కనకాల రిబ్బన్ కట్ చేసి ఫుడ్ ఫెస్టివల్ ని ప్రారంభించి అక్కడి మహిళల , యువతీ యువకులతో సందడి చేసి ఎంతో ఎంతో ఉత్సాహాన్ని , సంతోషాన్ని పంచడం అందరినీ ఆకట్టుకుంది. పదుల సంఖ్యలో సుమ కనకాలతో ఫోటోలకు మహిళలు , యువకులు ఎగబడటం కనిపించింది.

జ్యూస్ ఫెస్టివల్ ని ప్రారంభించిన తనికెళ్ళ భరణి చమక్కులు, చమత్కారాలతో కాస్సేపు సంబర వాతావరణం సృష్టించారు. ఈ ఫెస్టివల్ సిబ్బంది అడిగి మరీ తనికెళ్ళ భరణితో ఫోటో తీయించుకోవడం అక్కడి కార్మికులకు ఉల్లాసాన్ని కలిగించింది. మరొక ఉత్సాహవంతమైన పాత్ర మరొక ముఖ్య అతిధి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దనే అంశాన్ని నిస్సందేహంగా చెప్పాలి. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటూ .. అందరికీ ప్రాధాన్యతనిస్తూ … సమభావంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కనిపిస్తూ , కార్మికుల నుండీ యాజమాన్యాలవరకూ … మహిళల నుండి యువకుల వరకూ ఎంతో ఉత్సాహాన్ని నింపడం … నిర్వాహకులతో ‘ ఏమీ టెన్షన్ పడకండి … మీ పై శివానుగ్రహం పుష్కలంగా వుంది . కార్యక్రమం బాగా జరుగుతుంది ‘ … అంటూ ఆత్మశక్తినివ్వడం పురాణపండ శ్రీనివాస్ పై మరింత గౌరవాన్ని పెంచిందనే చెప్పాలి.

నిర్వాహకుల సమక్షంలో ప్రసన్నవదనంతో ఆసీనుడైన శివుని అందమైన జ్ఞాపికను సుమ కనకాలకు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అందించగా … నిర్వాహకుల మితృలు తనికెళ్ళ భరణి కి కూడా ఇదే ఈశ్వర జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమాన్ని చూడటానికి చుట్టు ప్రక్కల ప్రాంతాలవారు చూపిన ఉత్సాహం ఆసక్తిని రేకెత్తించింది.

Exit mobile version