దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) చిత్రం ప్రపంచ సినిమా వేదికపై భారతీయ సినిమాని సగర్వంగా నిలబెట్టింది. మొత్తానికి ఆస్కార్ ముంగిట తెలుగు సినిమా గొప్పతనాన్ని రాజమౌళి చాటిచెప్పారు. ఈ నేపథ్యంలో రాజమౌళి పై ‘మోడ్రన్ మాస్టర్స్’ అనే డాక్యుమెంటరీ రూపొందనున్న సంగతి తెలిసిందే. రాఘవ్ కన్నా దర్శకత్వంలో రానున్న ఈ ప్రాజెక్టును సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మిస్తున్నారు. ఈ ‘మోడ్రన్ మాస్టర్స్’ డాక్యుమెంటరీ ట్రైలర్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా రిలీజ్ చేశారు.
ఐతే, ఈ డాక్యుమెంటరీ తెలుగు ట్రైలర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగువారైన రాజమౌళి, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్‌కు వేరే డబ్బింగ్ ఆర్టిస్టులతో వాయిస్ చెప్పించడం కొందరు తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. మన డైరెక్టర్‌పై తీస్తూ మన స్టార్స్‌కు డబ్బింగ్ ఏంటంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. మరోవైపు ‘మోడ్రన్ మాస్టర్స్’ డాక్యుమెంటరీ ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగా ఉంది.