ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన క్రేజీ వెబ్ సిరీస్ లలో ”రానా నాయుడు” కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి నటించారు. దీంతో ఈ సిరీస్ ను అభిమానులు భారీ స్థాయిలో వీక్షించారు. ఇక ఈ వెబ్ సిరీస్ గ్రాండ్ సక్సెస్ కావడంతో, ఇప్పుడు ‘రానా నాయుడు’ సీజన్-2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
తాజాగా ఈ సీజన్-2 సిరీస్ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. రానా నాయుడు సీజన్ -2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుందని వారు ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. ఇక ఈ వీడియోలో రానా, వెంకటేశ్ లతో పాటు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా కనిపించారు. దీంతో ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
ఇక రానా నాయాడు సీజన్-2 సిరీస్ ను సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. రానా నాయుడు సీజన్-2 స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉండటంతో, ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.