లేటెస్ట్…”బ్రో” నుండి పవన్ – సాయి దుర్గ తేజ్ ల బీటీఎస్ స్టిల్స్ రిలీజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK) మరియు సాయి దుర్గ తేజ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ బ్రో (BRO). ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఏడాది అవుతుండటంతో మేకర్స్ బీటీఎస్ స్టిల్స్ ను రిలీజ్ చేశారు.

ఈ స్టిల్స్ లో పవన్ కళ్యాణ్ మరియు సాయి దుర్గ తేజ్ లు స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version