తెలుగు బుల్లితెర కమల్ హాసన్ గెటప్ శ్రీను హీరోగా టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ చేసిన తన మొదటి సినిమానే “రాజు యాదవ్”. దర్శకుడు కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ చిత్రంలో గెటప్ శ్రీను సరసన అంకిత హీరోయిన్ గా నటించింది. మరి ఈమె కూడా ఈ సినిమా తోనే తెలుగు సినిమాకి పరిచయం అయ్యింది. అయితే గెటప్ శ్రీను తన నటనకి తగ్గట్టుగానే సాలిడ్ రోల్ ఈ సినిమాలో దక్కింది కానీ ఈ సినిమా పూర్తి స్థాయి పాజిటివ్ టాక్ తెచుకోలేకపోయింది.
మరి అప్పుడు మిస్ అయ్యి ఓటిటిలో చూద్దాం అనుకునేవారికి అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చేసింది అని చెప్పాలి. ఈ సినిమా ఈరోజు నుంచి మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు ఆహా లో ట్రై చేయవచ్చు. ఇక ఈ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించగా అర్జున్ రెడ్డి, అనిమల్ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. అలాగే రాజేష్ కల్లేపల్లి, ప్రశాంత్ రెడ్డి లు నిర్మాణం వహించారు.