టాలీవుడ్ లో ఇటీవల కాలంలో ఇతిహాసాలకు సంబంధించిన రిఫరెన్స్ లు బాగా వర్కవుట్ అవుతున్నాయి. ఈ జాబితాలో వచ్చిన ‘హనుమాన్’, ‘కల్కి 2898 AD’ చిత్రాలు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల్లో రామాయణం, మహాభారతం రిఫరెన్స్ లు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఇదే బాటలో మరో యంగ్ హీరో కూడా తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే ‘టైసన్ నాయుడు’, ‘కిష్కిందపురి’ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక రీసెంట్ గా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తన కెరీర్ లోని 12వ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు. అయితే, ఈ సినిమా నేపథ్యం దశావతారం చూట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో 400 ఏళ్లనాటి ఓ ఆలయం ఉంటుందని.. దానిలో దశావతారాలు ప్రతిష్టించి ఉంటాయని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆ ఆలయానికి, దశావతారాలకి, హీరోకి సంబంధం ఏమిటి అనేది సినిమా కథగా చూపించబోతున్నారట.
టాలీవుడ్ లో దశావతారాల రిఫరెన్స్ చాలా అరుదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సినిమా వస్తుందనే వార్తతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాకు ‘హైంధవ’ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో దశావతారాల రిఫరెన్స్ ను చిత్ర యూనిట్ ఏ విధంగా చూపెట్టనుందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.