నాకు చీవాట్లు పడతాయి మా సార్ నుంచి – అనసూయ భరద్వాజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2 ది రూల్. డిసెంబర్ 6, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు జరిగిన సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనసూయ భరద్వాజ్ పాల్గొన్నారు. పుష్ప 2లో దాక్షాయణి పాత్ర పోషించిన అనసూయ భరద్వాజ్ ను, సినిమా గురించి అడగగా, నాకు భయం, నేను చెప్పను. నాకు చివాట్లు పడతాయి మా సార్ (సుకుమార్) నుంచి అంటూ చెప్పుకొచ్చారు.

రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, సునీల్, రావు రమేష్, ధనంజయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version